ముగ్గులు వేసి అంగన్వాడీల నిరసన

వినుకొండ: స్థానిక సురేష్‌ మాల్‌ రోడ్డులో అంగన్వాడీలు ముగ్గులు వేసి సోమవారం నిరసన తెలిపారు. జనవరి ఒకటి నూతన సంవత్సర సందర్భంగా కేక్‌ కట్‌ చేసి ఈ నూతన సంవత్సరంలో అయినా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పట్టించుకోవా లని, తమ డిమాండ్లు డిమాండ్‌ నెర వేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి అంగన్వాడీ జిల్లా కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి హాజరై మాట్లాడుతూ ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని న్నారు. ఇన్ని రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని విమర్శించారు. నిరసన తెలిపిన వారిలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు హనుమంతరెడ్డి ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్‌, సిఐటియు జిల్లా కోశాధికారి ప్రసన్న కుమారి, ఇంకా సెక్టార్‌ లీడర్స్‌ మున్ని, పి.ఉమాశంకరి, బీబీలు నాగజ్యోతి కృష్ణకుమారి, జి.పద్మ, పద్మావతి, శారద ,శ్రీదేవి, తిరుమలదేవి ఉన్నారు.

చిలకలూరిపేట: స్థానిక శాఖ గ్రంథాలయం వద్ద అంగ న్వాడీలు చేస్తున్న నిరవధిక నిరసన దీక్ష సోమవారం నాటికి 21వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీ నర్‌ పేరుబోయిన వెంకటేశ్వర్లు మాట్లా డుతూ 21 రోజుల నుంచే నిరవధిక నిరా హారదీక్ష చేస్తున్న మహిళలను గూర్చి కనీ సం ఆలోచించకుండా మొద్దు నిద్ర నట ిస్తున్న ఈ జగన్మోహన్‌రెడ్డికి త్వరలోనే అంగన్వాడీలు, వర్కర్లు,సెక్టారు లీడర్లు ఆ యాలు టీచర్లు బుద్ధి చెప్పే రోజులు దగ్గర లోనే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ అధ్యక్షురాలు జి.సావిత్ర మాటా ్లడుతూ ఇస్తామన్న సౌకర్యాలు అదిగు తున్నట్లు తెలిపా రు. అవి కూడా అమలు పరచకపోవడం వల్ల పండుగలు,శుభ దినాలు అని లేకుండా ఆడవారు రోడ్డు పాలయ్యామన్నారు. కె.విపిఎస్‌. నాయ కులు ఎం.విల్సన్‌, సాతులూరిబాబు, బి.కోటా నాయక్‌ పాల్గొని పూర్తి మద్దతు ప్రకటించారు.

పిడుగురాళ్ల: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని, అంగన్వాడీల పోరాటాలు వరి ్ధల్లాలంటూ పిడుగురాళ్లలోని శిబిరం దగ్గర ముగ్గువేసి నిరసన తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటాపాట నిర్వ హించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మ్యూజికల్‌ చైర్స్‌, రింగాట, కబడ్డీ, తాడు లాగుట వంటి ఆటలు ఆడారు. పాటలు పాడుతూ నృత్య ప్రదర్శన చేశారు. కార్య క్రమంలో సిఐటియు నాయకులు టి.శ్రీని వాసరావు, ఆటా పాటలు ప్రదర్శించిన వారిలో షేక్‌ హజ్ర, షపీయా, శివ రంజని, రమజాన్‌, నాగమణి, శివలక్ష్మి, వెంకట రమణ, సుజాత,శివ పార్వతి,ఊర్మిళ ఉన్నారు.

మాచర్ల్ల: రిలే నిరహరదీక్షలలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఒకరికోకరు నూతన సం వత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సమ్మెలో భాగంగా బారసాల కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చిత్రపటాన్ని ఉయ్యాలలో పెట్టి ఊపుతూ నిరసన తెలిపారు. ఎంతో మంది పేద పిల్లలకు అమ్మగా, ఉపా ధ్యాయనిగా పని చేస్తున్న తమకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంచి హృదయంతో తమ సమస్యలు పరి ష్కరిం చాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఉషా రాణి, ఇందిరా, కాకర్ల పద్మావతి, కోటేశ్వరి, సుం దరలీల, శారద, దుర్గా శివలక్ష్మీ, రుక్మిణి, జయలక్ష్మీ, శివపార్వతీ, లీలావతి, వెంకటరమణ, సైదమ్మ, చిలకమ్మ, మల్లేశ్వరి పాల్గొన్నారు.

అంగన్వాడీల మౌనదీక్ష

తాడేపల్లి: ప్రభుత్వం తమ డిమాండ్లు పరి ష్కరించాలని తాడేపల్లిలో అంగన్‌వాడీలు మౌనదీక్ష చేపట్టారు. ప్రభుత్వం అంగన్వాడీలు చేస్తున్న అనేక రకాల ఆందోళనలు చూసైనా తమ సమ స్యలు పరిష్కరించి చిత్తుశుద్ధి నిరూపించుకోవా లని కోరారు. కార్యక్రమంలో యూని యన్‌ గౌరవాధ్యక్షులు వేముల దుర్గారావు, కిరణ్మయి, సబిత, కృష్ణవేణి, శోభారాణి, లక్ష్మి, మాణిక్యం, వైదేహి, మరియమ్మ, సుజాత, కోటేశ్వరమ్మ, అనూష, దేవి పాల్గొన్నారు.

➡️