మున్సిపల్‌ కమిషనర్‌కు సమ్మె నోటీసు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు డిమాండ్ల సాధన కోసం ఈనెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొననున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ పేర్కొన్నారు. గురువారం మున్సిపల్‌ కార్మికులతో కలిసి కమిషనర్‌ ఎం.జనార్థన్‌రెడ్డికి సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత రెండు సంవత్సరాలుగా వివిధ రూపాలలో తాము ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించ లేదని అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, అందరినీ రెగ్యులర్‌ చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, సిబ్బందిని పెంచాలని, కార్మికులకు పనిముట్లు, రక్షణ కిట్లు అందించాలని, మతి చెందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలోని వ్యక్తికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని స్పషం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.ఓబయ్య, జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి, డివిజన్‌ అధ్యక్షులు ప్రసాద్‌, కార్యదర్శి బాలాజీ, కార్మికులు సాలమ్మ, రమణ, రవిశంకర్‌ పాల్గొన్నారు.

➡️