మున్సిపల్‌ కార్మికుల ముట్టడి

ప్రజాశక్తి- కడప అర్బన్‌ మున్సిపల్‌ కార్మికులకు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నగరంలో మున్సిపల్‌ కార్మికులు కార్పొరేషన్‌ను ముట్టడించారు. కార్యాలయంలో పలికి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సుంకర కిరణ్‌ మాట్లాడుతూ సమ్మె మొదలై 12 రోజులవవుతున్నా ప్రభుత్వనికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఇంతవరకు ఈ ఉద్యమం శాంతియుతంగా చేశామని, అధికారుల చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తెలిపారు. తామూ అదే రీతిన జవాబు చెబుతామని హెచ్చరించారు. నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కంచుపాటి శ్రీరామ్‌ మాట్లాడుతూ డిమాండ్‌ పరిష్కరించే వరకు పోరాటం ఆగదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కంచిపాటి తిరుపాల్‌, గోపి, కిరణ్‌, శ్రీధర్‌ బాబు, నాగరాజు, ఇత్తడి ప్రకాష్‌, ఆదాము, వై.రమేష్‌ సి. కొండయ్య, దస్తగిరమ్మ, కొండమ్మ, ధరణి వాటర్‌ సెక్షన్‌ కార్మికులు, ఎలక్ట్రిసిటీ, ఇంజినీరింగ్‌ కార్మికులు పాల్గొన్నారు. బద్వేలు : మున్సిపల్‌ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 12వ రోజులో భాగంగా బద్వేల్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌( సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బిసి సంఘం నాయకులు గురుమూర్తి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి మంత్రుల కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా మున్సిపల్‌ కార్మికుల సమ్మెపై ప్రత్యక్ష జోక్యం చేసుకోవాలని, లేనియెడల ఆందోళనలు ఉధతం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షులు షేక్‌ ఆదిల్‌, సిఐటియు పట్టణ నాయకులు రాజగోపాల్‌, యూనియన్‌ పట్టణ అధ్యక్షుడు శాంప్రవీణ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు హరి, ఉపాధ్యక్షులు దేవమ్మ, శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు, కోశాధికారి శివకుమార్‌, కార్యదర్శులు సత్యరాజు,పాలయ్య, ప్రవీణ్‌ కుమార్‌, కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌, రామయ్య, కిరణ్‌, పెంచల వరప్రసాద్‌ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కార్మికుల చేస్తున్న దీర్ఘకాలిక సమ్మెకు ప్రభుత్వానిదే బాధ్యత అని మున్సిపల్‌ కార్మిక సంఘ (సిఐటియుఅనుబంధం) గౌరవాధ్యక్షులు సత్యనారాయణ కార్యదర్శి సాల్మన్‌ తెలిపారు. సమ్మె శనివారానికి 12వ రోజుకు చేరుకున్న సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మౌనం వీడి తమ సమస్యలను పరిష్కరించాలన్నారు.

➡️