మురుగు సమస్యకు తాత్కాలిక పరిష్కారం

మురుగు సమస్య

‘ప్రజాశక్తి’ కథనానికి స్పందన

ప్రజాశక్తి-పెందుర్తి : జివిఎంసి 95వ వార్డు మరిడిమాంబ కాలనీలో మురుగు, దోమల సమస్యకు సంబంధిత అధికారులు తాత్కాలిక పరిష్కార చర్యలు చేపట్టారు. ఈ నెల 21న ‘డ్రైనేజీ వ్యవస్థ ఏదీ?’ శీర్షికతో ప్రజాశక్తిలో వెలువడిన కథనానికి స్పందించిన జివిఎంసి యంత్రాంగం అదేశాల మేరకు మలేరియా ఇన్‌స్పెక్టర్‌ దాలినాయుడు ఆధ్వర్యంలో మురుగునీరు మళ్లి పోయేందుకు తాత్కాలికంగా చిన్న కాలువ ఏర్పాటు చేశారు. దోమల నివారణకు బ్లీచింగ్‌ చల్లడంతోపాటు దోమల నివారణి పిచికారీ చేశారు. ప్రజాశక్తి కథనానికి అధికారులు స్పందించి దోమలు నివారణ చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని మరిడిమాంబ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ గున్నమ్మ, గౌరునాయుడు రమణ కోరారు.

➡️