మెడకు ఉరితాళ్లతో నిరసన

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ప్రయివేటు వ్యక్తులతో పనులు చేయించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకులు అడ్డుకున్నారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె శనివారం ఐదో రోజు భాగంగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద రాయచోటి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అర్ధనగంగా ఉరితాళ్లు మెడకు వేసుకుని నిరసన తెలియజేశారు. పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నినాదాలు నినదిం చారు. ఉదయం 5 గంటలకు క్లాప్‌ డ్రైవర్ల స్థానంలో ప్రయివేట్‌ వ్యక్తులను నియ మించాలని అధికారుల ప్రయత్నాన్ని పారిశుధ్య కార్మికులతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు అడ్డుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ రెడ్డి ఎంటర్‌ ప్రైజెస్‌ యాజమాన్యానికి ఏజెంట్‌గా పనిచేయడమే గాక పోలీసు సాయంతో ఆందోళన చేస్తున్న కార్మికులు, సిఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రామాంజులు భుజానికి, చేతలకు గాయాలయ్యాయి. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పోలీసుస్టేషన్లో బైటాయింపు చేయడంతో 7.30కి వదలేశారని తెలిపారు. అనంతరం పది గంటలకు ఉరితాడు నిరసన కార్యక్రమానికి పెద్దఎత్తున అంగన్వాడీలు మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి.భాగ్య లక్ష్మి,రైతు సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి ఎస్‌.రామచంద్ర, కెవిపిఎస్‌ జిల్లా కో-కన్వీనర్‌ డిసి వెంకటయ్య మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచడంలో కమిషనర్‌ నిర్లక్ష్యంతో మిగిలిన కార్మికుల మీద తీవ్ర పనిభారం పెరుగుతోందని తెలిపారు. రిటైర్‌ భెనిఫిట్స్‌ గ్రాట్యూటి ఇవ్వకుంటే సామాజిక సాధికారత ఎలా అవుతుందన్నారు. క్లాఫ్‌ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలనిచట్టం చెబితే కేవలం రూ.10 వేలిచ్చి మిగిలినవి నిధుల్లేవని కాలాలు సరైనవి కావన్నారు. మీరు పోటీ కార్మికుల చేత పని చేయించడం ఆపాలన్నారు. మున్సిపల్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ రెగ్యులర్‌ చేసే వరకు ప్రజాసంఘాల మద్దతుతో నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు బంగారుపాప, ఖాజాబీ, విజయ, సిద్ధమ్మ, అరుణ, అమరావతి, మాలతి, సురేఖ, మున్సిపల్‌ కార్మికులు వై.వెంకటరమణ, రాంబాబు, అగ్గిరామయ్య, జి.వెంకటరమణ, ఓబులేసు, తిరుపాల్‌, మంగమ్మ, రమణమ్మ, సిఎం లక్ష్మిదేవి, రవికుమార్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు చేపడుతున్న కార్మికులు పురపాలక కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట నియోజకవర్గ బాధ్యులు పూల భాస్కర్‌, సమన్వయ కమిటీ సభ్యులు శెట్టిపల్లి సన్నీ నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపి ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల డిమాండ్లు నెరవేర్చే వరకు కాంగ్రెస్‌ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు పారిశుధ్య కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు డిమాండ్‌ చేస్తున్న కోరికలన్నీ న్యాయబద్ధమైనవేనన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌, మాజీ జడ్‌పిటిసి యల్లటూరు శివరామరాజు, కోలాటం హరిపాల్గొన్నారు.

➡️