మేలు జరిగిందంటేనే ఓటు వేయండి : బొత్స

Feb 4,2024 20:48

ప్రజాశక్తి- మెరకముడిదాం: ‘మీకు మేలు జరిగిందంటేనే ఓటు వెయ్యండి, మోసం జరిగితే వేయవద్దు’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం గర్బాంలో జరిగిన వైఎస్సార్‌ ఆసరా సంబరాల్లో ఆయన మాట్లాడారు. ముందుగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒక్క మెరక ముడిదాం మండలంలోనే రూ.10 కోట్లు నాల్గవ విడత ఆసరా నిధులు మహిళల ఖాతాల్లో వేశామన్నారు. వైసిపి పాలనలో ఈ మండలాన్ని రూ.105కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే వాన్ని తప్ప మోసం చేయటం తనకు తెలియదని అన్నారు. తన వల్ల ఈ మండలం అభివృద్ధి చెందిందంటేనే, మీకు మంచి చేసాను అనుకొంటేనే, రాబోయే ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపంచాలని కోరారు. జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ మండలం మంత్రికి అడ్డా అన్నారు. ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదోక్కుకొనేలా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జెసి కార్తిక్‌, ఎంపిడిఒ పావని, ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, వైసిపి నాయకులు తాడ్డి వేణు, ఎస్‌వి రమణరాజు, కోట్ల వెంకటరావు, పప్పల కృష్ణమూర్తి, కెఎస్‌ ఆర్కే ప్రసాద్‌, బూర్లె నరేష్‌ కుమార్‌, వైస్‌ ఎంపిపి తలచుట్ల హరి బాబు, కందుల పార్వతి, కెవి సూర్య నారాయణరాజు తహశీల్దార్‌ పద్మావతి, ఎపిఎం కె. ఉమామహేశ్వరరివు, సర్పంచులు, ఎంపిటిసిలు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.బొండపల్లి: ప్రభుత్వ పథకాలు పొందిన లభ్దిదారుల ఆశీస్సులే ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. మండలంలోని పోలీసు స్టేషన్‌ సమీపంలోని ఓ లేఅవుట్‌లో ఎంపిపి చల్ల చలంనాయుడు అధ్యక్షతన వైఎస్‌ఆర్‌ నాలుగువ విడత ఆసరా సంబరాల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనరసయ్య మాట్లాడుతూ మహిళలకు ఆర్ధిక పరిపుష్టిని తీసుకు రావడానికి డ్వాక్రా రుణ మాఫీని చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిదేనన్నారు. ఎమ్మెల్సీ సురేష్‌బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన రెడ్డికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం సులోచనాదేవి, ఎఎంసి చైర్మన్‌ వేమలి ముత్యాల నాయుడు, జెడ్‌పిటిసి రాపాక సూర్యప్రకాశరావు, వెలుగు ఎపిడి కె. సావిత్రి, ఎంపిడిఒ ఎస్‌. హరిహరరావు, వైస్‌ ఎంపిపి గొండెల ఈశ్వరరావు, నాయకులు రొంగలి పోతన్న, పోరిపిరేడ్డి అప్పలనాయుడు, బి.రవికుమార్‌, బివి ప్రభుజీ, మహంతి రమణ, గొల్లు సతీష్‌ కుమార్‌, వైసిపి మండల అధ్యక్షులు బొద్దల చిన్నం నాయుడు , వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.కొత్తవలస: పేద ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారు గర్వంగా తలెత్తుకొనేలా చేయడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ క్రీడా మైదానంలో వైఎస్‌ఆర్‌ కాంతిపథం ఏరియా కోఆరి ్డనేటర్‌ ఎన్‌.ఆదయ్య ఆధ్వర్యంలో ఆదివారం 4వ విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ మండలంలో 1295 ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లోని సుమారు 15,266 మంది మహిళలకు లబ్ధి చేకూరేలా రూ.8.81 కోట్ల వారి ఖాతాల్లోనే వేస్తున్నామన్నారు. వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ వేచలపు చినరామనాయుడు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, వైస్‌ ఎంపిపి కర్రి శ్రీను, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, ఎఎంసి చైర్మన్‌ మూకల కస్తూరి, కొత్తవలస మేజరు పంచాయతీ సర్పంచ్‌ ఎంవై రామస్వామి, జెసిఎస్‌ మండల ఇంచార్జ్‌ బొంతల వెంకటరావు, సర్పంచులు జోడు రాములమ్మ, విరోతి కొండల రావు, పీతల కృష్ణ, అల్లం సత్యన్నారాయణ, విరోతి వెంకట రమణ, ఎంపిటిసిలు, పాల్గొన్నారు

➡️