మోకాళ్లపై నిరసన తెలియజేసిన అంగన్వాడీలు

Dec 24,2023 15:04 #Anganwadi strike, #guntur

ప్రజాశక్తి-మంగళగిరి(గుంటూరు) : అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ యూనియన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 13వ రోజు చేరింది. మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్లోని సమ్మె శిబిరంలో అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, అంగన్వాడి యూనియన్‌ నాయకులు జి రాజ్యలక్ష్మి, ది.మేరీ రోజమ్మ, ఏ పద్మజ, అనురాధ,జానీ బి, కే.విజయలక్ష్మి, పి.తిరుపతమ్మ, సులోచన తదితరులు పాల్గొన్నారు.

➡️