యువకుడు ఆత్మాహత్యాయత్నం

Nov 27,2023 22:41

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు బెదిరించాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా చిన్నగంజాం చెందిన బెన్నీ సోమవారం కలెక్టర్‌ కార్యాలయం లోని మూడంతస్తుల భవనం పైకెక్కి డీజిల్‌ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. రెండవ పట్టణ సిఐ జగదీష్‌ ఆధ్వర్యంలో పోలీసులు సిబ్బంది బెన్నీని చాకచక్యంగా పట్టుకుని కిందకు దించారు. అనంతరం బెన్నీ మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం దళిత నాయ కులను నమ్మి తమ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రభుత్వం భూములు, నష్టపరిహారం ఇస్తామని చెప్పిందన్నారు. ఆ కేసులో తనకు ఉద్యోగం ఇస్తామని నమ్మించి 19 సంవత్సరాల నుంచి దళిత నాయకులు తిప్పుకొని ప్రస్తుతం కేసు రాజీ చేసుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఓ దళిత నాయకుడు నువ్వు ఆత్మహత్య యత్నం చేస్తే నీకు ఉద్యోగం వస్తుందని గతంలో చెప్పారన్నారు. కలెక్టర్‌, జిల్లా ఎస్‌పి చుట్టూ అనేక సార్లు తిరిగినప్పటికీ న్యాయం జరగలేదన్నారు. తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

➡️