యూనియన్‌ బలోపేతానికి కృషి

Dec 27,2023 21:44
ఫొటో : మాట్లాడుతున్న నంద ఓబులేసు

ఫొటో : మాట్లాడుతున్న నంద ఓబులేసు
యూనియన్‌ బలోపేతానికి కృషి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ప్రతిఒక్కరూ ఎపి బహుజన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నిర్మాణం పటిష్టతకు కృషి చేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా లీగల్‌ అధ్యక్షుడు నందా ఓబులేసు పేర్కొన్నారు. ఎపి బహుజన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, నారాయణస్వామి, పెరియార్‌ రామస్వామి, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, కాన్షీరాం లాంటి మహానుభావుల త్యాగఫలమే ఇవాళ మనం ఈ స్థాయికి ఎదగగలుగుతున్నామన్నారు. వారి స్ఫూర్తితో ప్రతిఒక్కరూ మంచి స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ ఎపి బహుజన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ మస్తానయ్య, సెక్రటరీ కె.విక్టర్‌ మాట్లాడాతూ యూనియన్‌ ఏర్పడే క్రమంలో 5,6మంది సభ్యులతో ఏర్పడిన యూనియన్‌ ఇప్పుడు దాదాపు 56 మందితో యూనియన్‌ బలపడిందని, నిర్మాణం బాగుంటే యూనియన్‌ బలపడుతుందన్నారు. నిర్మాణాత్మకమైన ఆలోచనతో ముందుకెళ్దామని, యూనియన్‌ను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు కొండలరావు సెక్రటరీ బాలాజీ, ఎఎస్‌పేట ఎఇ నిరంజన్‌, కార్యక్రమంలో బిఎస్‌పి నాయకులు రామకృష్ణ, జ్యోతి, శ్రీనివాసులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

➡️