యోగా ఛాంపియన్స్‌కు కమిషనర్‌ అభినందన

Dec 19,2023 23:49
యోగా ఛాంపియన్స్‌కు

ప్రజాశక్తి – కాకినాడ

ప్రపంచ కప్‌ యోగా ఫైనల్‌ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌, బ్రాంజ్‌ మెడల్‌ సాధిం చిన కంబాల భాస్కర్‌ వెంకట సాయిరామ్‌, గంపల లహరి దుర్గ, శిక్షణ అందించిన జాతీయ యోగా కోచ్‌ ధర్మాడి దుర్గా శాంత ప్రసాద్‌లను కమిషనర్‌ నాగ నరసింహరావు అభినందించారు. మంగళవారం స్మార్ట్‌సిటీ భవన్‌ సమావేశ మందిరంలో కాకినాడ నగర కార్పొరేషన్‌ అధ్వర్యంలో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్‌-18 బాలుర విభాగంలో భాస్కర్‌ సాయిరాం, అండర్‌-14 బాలికల విభాగంలో లహరి దుర్గలు ఈ ఘనత సాధించి రాష్ట్రానికే గర్వకారణంగా నిల్చారని అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్‌ యోగా విజేతలు భాస్కర్‌, లహరి దుర్గ, జాతీయ యోగా కోచ్‌ దుర్గా శాంత ప్రసాద్‌ లను దుశ్శాలువా, జ్ఞాపికలతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీ ప్రసన్న, ఎపి యోగ విద్యా పీఠం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ యోగా గురువు చిట్టూరి చిట్టిబాబు లు పోల్గొన్నారు. విజేతలుకు ఉదయ భానోజీ, మండపాక సూర్యనారాయణ మూర్తి, సర్వేశ్వరరావు, రామకష్ణ, విజయలక్ష్మీ, పరమేశ్వర రావు అభినందనలు తెలిపారు.

➡️