రహదారికి మరమ్మతులు

ప్రజాశక్తి-టంగుటూరు : కొండపి రోడ్డులోని ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వరకూ రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు ఆర్థిక సహకారంతో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మరమ్మత్తుల పనులను అశోక్‌ బాబు సోమవారం పర్యవేక్షించారు. క్వారీ డస్ట్‌ తోలి గుంతలను పూడ్చారు. అనంతరం జిఎస్‌పి కంకరతో రోలింగ్‌ చేసి గుంటలు పూర్తిగా పూడ్చారు. అశోక్‌ బాబు తన సొంత నిధులు రూ.3 లక్షలు వెచ్చించి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించడం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

➡️