రాజంపేట పార్లమెంట్‌లో టిడిపి జెండా ఎగురవేస్తాం

ప్రజాశక్తి-రాయచోటి రాజంపేట పార్లమెంట్‌లో పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని రాజు ఒలంపియాడ్‌ స్కూల్‌ ప్రక్కన జరిగిన పార్లమెంట్‌ నియోజకవర్గం జయహో బిసి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరా చకాలు ఎక్కువయ్యాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బిసిలంతా కలిసి పని చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. పార్లమెంట్‌ అధ్యక్షులు చమ్మర్తి జగన్మోహన్‌ రాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి బిసిలంతా ఐక్యమత్యంగా పనిచేయాలన్నారు. రాంప్రసాద్‌రెడ్డి రాయచోటి ఎస్‌ఎన్‌ కాలనీలోని టిడిపి కార్యాలయం వద్ద నుండి వేలాది మంది బిసి నాయకులుతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బిసిలు పట్టుకొమ్మలని అలాంటి వారని తెలిపారు. బిసిపైన ప్రభుత్వం హత్యాప్రయత్నాలు చేసి అరాచకాలు సష్టించడమే కాకుండా జిల్లాలో బిసి నాయకుల పైన తప్పుడు కేసులు బనాయించి ఎంతో ఇబ్బందులు పెట్టారన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ బిసిలకు అండగా నిలిచే పార్టీ అని అలాంటి పార్టీని గెలిపించుకొని చంద్ర బాబు నాయుడుఃని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటే బిసిలకు న్యాయం జరగ డమే కాకుండా రాజకీయంగా ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. బిసిలందరూ ఒక్క తాటిపై కొచ్చి తనతోపాటు రాజం పేట పార్లమెంట్‌ అభ్యర్థి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం, రాయచోటి నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. వివిద బిసి కులాలు వారు వారి కులవత్తులకు చెందిన యాదవులు గొర్లను, కుమ్మరులు కుండలను, వడ్డెరలు సుత్తిని, మత్స్యకారులు చాపలను వారి చేతికి అందజేశారు. కార్యక్రమంలో తంబళ్ళపల్లి టిడిపి అభ్యర్థి జయచంద్రారెడ్డి, రాజంపేట టిడిపి ఇన్‌ఛార్జి చంగల్‌ రాయుడు, పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు దాసరిరాజు వాణి, మహిళ అధ్యక్షుఃలు వంగి మళ్ళ నాగ సబ్బుమ్మ పాల్గొన్నారు.

➡️