చిరుధాన్యాలతో జీవితం సుఖమయం

ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న వీసీ
ప్రజాశక్తి – ఎఎన్‌యు :
నేటి ఆధునిక సమాజంలో వస్తున్న మార్పుల్లో భాగంగా సుఖమయ జీవనానికి చిరుధాన్యాల తోడ్పాటు అవసరమని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పి రాజశేఖర్‌ అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా వర్సిటీలోని ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ విభాగం ఆధ్వర్యంలో బుధవారం మిల్లెట్‌ ఫెస్ట్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, అధిక పోషక విలువలున్న చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే అనేక లాభాలు ఉంటాయని చెప్పారు. అనంతరం చిరుధాన్యాల వల్ల ఉపయోగాలపై రెక్టార్‌ ప్రొఫెసర్‌ పి.వరప్రసాద్‌మూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.కరుణ మాట్లాడారు. ఫెస్ట్‌ ఉద్దేశాన్ని విభాగాధిపతి డాక్టర్‌ కె.వి.శాంతిశ్రీ వివరించారు. అధ్యాపకులు డాక్టర్‌ బి.భవిత, డాక్టర్‌ సిహెచ్‌.మంజుల, డాక్టర్‌ డి.జలజకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️