రెవెన్యూ సహాయకుల నిరసన

Dec 21,2023 22:25
నిరసన తెలుపుతున్న విఆర్‌ఎలు

నిరసన తెలుపుతున్న విఆర్‌ఎలు
రెవెన్యూ సహాయకుల నిరసన
ప్రజాశక్తి-ఉదయగిరి:సమస్యల పరిష్కారం కోసం విఅర్‌ఎలు తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం విఆర్‌ఎల సంఘ అధ్యక్షులు దుగ్గయ్య మాట్లాడుతూ గ్రామంలో నివసిస్తూ, అనునిత్యం ప్రజా సమస్యలు పరిష్కరించడం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పేరుకు మాత్రం పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులు, కానీ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారన్నారు. భూ సర్వేలో కీలకంగా పనిచేస్తు 2017 మార్చి 24వ తేదీన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌ రెడ్డి వీఆర్‌ఏ ల దీక్ష శిబిరంలోకి వచ్చి అధికారంలోకి రాగానే సమస్యలు తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటినా ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహించారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో విఅర్‌ఎలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️