రైతులకు తక్షణం నష్టపరిహారమివ్వాలి 

తాడేపల్లి రూరల్‌: ఇటీవల తుపాను కారణంగా పంటల నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదు కునేందుకు, పంట నష్టం అంచనా వేసి, తక్ష ణమే రైతులకు నష్టపరిహారం అందిం చాలని, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుం టూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివ శంకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎంటిఎంసి పరిధిలోని చిర్రా వూరులో రైతు, కౌలు రైతు సంఘం నాయ కులతో కలిసి ముంపునకు గురైన పొలా లను ఆయన పరిశీలించారు. అనంతరం రైతు భరోసా కేంద్రం అధికారి శాంతిశ్రీని కలిసి, పంట నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ వినతిపత్రాన్ని ఆమెకు రైతు నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ పంటలు నీట మునగడానికి ప్రధాన కార ణం పంట పొలాల డ్రైనేజీ కాలువ పూడుకు పోవడమేనని అన్నారు. ఈ సంవత్సర కాలంలో, రెండు పర్యాయాలు అధిక వర్షాలు కురిసి, పంటలు వేసిన రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వేలకు వేలు అప్పులు తీసుకొని, సేద్యం చేసే రైతు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్ప డిందన్నారు. వ్యవసాయ శాఖాధికారులు తక్షణమే స్పందించి, పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ధాన్యం రైతులకు రూ.25,000, వాణిజ్య పంటలైన అరటి, కంద, ఆకుకూరలు తదితర పంటలు నష్టపోయిన రైతులకు రూ.50,000 పంట నష్ట పరిహారంగా అందించాలని ఆంద్ర óప్రదేశ్‌ రైతు సంఘం డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. కౌలు రైతు గుర్తింపు కార్డుతో సం బంధం లేకుండా పంట నష్టం అంచనా వేసి, వారికి కూడా పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆంద్ర óప్రదేశ్‌ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు డి.వెంకటరెడ్డి, కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పి. కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల అధ్యక్షులు పి.శివ నాగేశ్వరరావు, పి శంకరరావు పాల్గొన్నారు.

కౌలు రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలి

దుగ్గిరాల: చుట్టుపక్కల రైతులతో సంప్రదించి సిసిఆర్సి కార్డు లేని కౌలు రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని కౌలు రైతు సం ఘం జిల్లా అధ్యక్షులు మన్నవ నాగమల్లేశ్వర రావు కోరారు. రైతులందరికీ సిసిఆర్సి కార్డు లేనందున నష్టపరిహారం అందకపోతే తీవ్రంగా నష్టపోతారన్నారు. తడిసిన , రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయా లన్నారు. రబీలో పూర్తి సబ్సిడీపై విత్తనాలు రైతులందరికీ అందజేయాలన్నారు. ఈ మేరకు రైతు భరోసా కేంద్రం అధికారులు లావణ్య, శిరీష లకు అర్జీని ఇచ్చారు. కార్య క్రమంలో కౌలు రైతు సం ఘం నాయకులు కె.దావీదు, ఎం.అం జయ్య, కౌలు రైతులు ఎన్‌.మరియదాసు, ఎ.ఆశీర్వాదం షేక్‌ యాసిన్‌, షేక్‌ కరీముల్లా, షేక్‌ ఖాన్‌ ప్రతీఫ్‌, మల్లా చిన్న నరసింహారావు, కె.రామా రావు, ఎం.రాజేష్‌ పాల్గొన్నారు.

➡️