రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్‌ సబ్సిడీ

Mar 6,2024 21:02

 ప్రజాశక్తి-విజయనగరం  : గత ఏడాది డిసెంబర్‌ లో సంభవించిన మిచాంగ్‌ తుఫాన్‌ పంట నష్టం కింద పరిహారం అందించడంలో భాగంగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బుధవారం బటన్‌నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిసిఎంఎస్‌. చైర్‌పర్సన్‌ అవనాపు భావన, జిల్లా వ్యవసయాధికారి తారక రామారావు , రైతులు బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మెగా చెక్కును లబ్దిదారులకు అందజేశారు. జిల్లాలో 2023 మిచంగ్‌ తుఫాన్‌ కు 297.77 హెక్టార్ల విస్తీర్ణం లో పంట నష్టం జరిగింది. ఇందుకు గాను ఇన్పుట్‌ సబ్సిడీ కింద జిల్లాలో 1059 మంది రైతులకు 50.62 లక్షల పెట్టుబడి రాయితీని జమ చేశారు.

➡️