రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలు

Feb 5,2024 21:17

ప్రజాశక్తి-వంగర  : మండలంలోని చిన రాజులగుమడ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. రాజాం నుంచి కోతుల గుమడ వెళ్తున్న ఆర్‌టిసి బస్సు రాజులగుమడ నుంచి చెరకు పనులు ముగించుకొని ఆటోలో స్వగ్రామం శివ్వాం వెళ్తున్న ప్రయాణికులను ఢకొీంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది వరకు గాయపడ్డారు. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రాజాంలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కలమట రథాలు, బడే శంకర్‌, కృష్ణవేణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పాలకొండ ఆర్‌టిసి డిపో మేనేజర్‌ డి.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎస్‌.లక్ష్మణరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️