లింగ ఆధారిత వివక్ష సరికాదు 

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: లింగ ఆధారిత వివక్ష, హింస ఎంత మాత్రం సరికాదని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ‘లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం’లో భాగంగా ఈ నెల 25 నుంచి డిసెంబరు 22 వరకు డిఆర్‌డిఏ, మెప్మా ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వీటికి సంబంధించిన పోస్టర్లను శనివారం ఆయన ప్రకాశం భవనంలోని తన ఛాంబరులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో డి.ఆర్‌.డి.ఏ, మెప్మా పీడీ టి. రవికుమార్‌, ఐసిడిఎస్‌ పీడీ మాధురి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, డిపిఎంలు, ఏిపిఎంలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️