ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా

ధర్నా చేస్తున్న న్యాయవాదులు

ప్రజాశక్తి-అనకాపల్లి

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గురువారం అనకాపల్లి బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఈ చట్టం అమలైతే ప్రజలకు కలిగే ముప్పును వివరించారు. సివిల్‌ కోర్ట్‌ పరిధి నుంచి రెవెన్యూ పరిధిలోకి భూ వివాదాలకు సంబంధించి చట్టాన్ని తేవడంతో ప్రజల మధ్య వివాదాలు పెరిగిపోతాయని తెలిపారు. సామాన్య ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతారన్నారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా చట్టాన్ని తొలగించే వరకు న్యాయవాదులు ఎవరు విధులు చేపట్టకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. అనంతరం విధులను బహిష్కరించారు. అసోసియేషన్‌ అధ్యక్షులు సాయి లక్ష్మణ్‌ నేతృత్వంలో జరిగిన ధర్నాలో బార్‌ సెక్రెటరీ సీనియర్‌ న్యాయవాదులు పిళ్ళా హర శ్రీనివాస్‌, కుమార్‌, బాలగంగాధర్‌ తిలక్‌, పిఎస్‌ పట్నాయక్‌, సుధాకర్‌, జగపతి, గోవింద్‌, సుంకర శ్రీనివాస్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️