వారికి ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలి

Feb 24,2024 00:04

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ కఎస్‌ లక్ష్మణరావు, యుటిఎఫ్‌ నాయకులు
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా :
రానున్న సార్వత్రిక ఎన్నికల విధుల నుండి హృద్రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణుల, వికలాంగులైన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని యుటిఎఫ్‌ నాయకులు కోరారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ను ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, యుటిఎఫ్‌ నాయకులు శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు. పి.ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ నరసరావుపేట పరిసర ప్రాంతాలకు 16 శాతం ఇంటి అద్దె భత్యం ఇస్తూ గతంలో విడుదల చేసిన గెజిట్‌లో పొందుపరచని గోనేపూడి, పమిడిపాడు గ్రామాలను కూడా చేర్చాలని కోరారు. కలెక్టర్‌ స్పందిస్తూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు స్వయంగా దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మినహాయింపు ఇస్తామని చెప్పారు. సప్లిమెంటరీ గెజిట్‌ -2 గ్రామాలు చేర్చి 16 శాతం హెచ్‌ఆర్‌ ఆ గ్రామాల్లోని ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఎం.మోహనరావు, వెంకటేశ్వరరావు, కె.రవిచంద్రశేఖర్‌, షేక్‌ జమాల్‌, వై.శ్రీనివాసరావు, సాయి, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️