వికలాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : ఎంఇఒ

ప్రజాశక్తి – టి.నరసాపురం

వికలాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మండల విద్యాశాఖాధికారి టి.రామ్మూర్తి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిత కేంద్రాల్లో వికలాంగ పిల్లలకు ప్రత్యేక విద్య ద్వారా ప్రభుత్వం అందించే సేవలను వినుయోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రంలో ఐఇడిఎస్‌ఎస్‌ వీరాస్వామి, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు కె.రాజు, జె.పృథ్వీరాజ్‌ పాల్గొన్నారు.

➡️