విజయసాయిని కలిసిన కదిరి

ప్రజాశక్తి-సిఎస్‌ పురం వైసిపి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాస గృహంలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు కదిరి బాబురావు మర్యాదపూర్వకంగా కలిశారు. పూలబొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. అలాగే మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. కనిగిరిలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం. బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసిన వారిలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా పిడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ వైఎం ప్రసాద్‌రెడ్డి పలువురు ఉన్నారు.

➡️