విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

Dec 22,2023 21:42

ప్రజాశక్తి – సీతానగరం  :  మండలంలోని మరిపివలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎ.జోగారావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. నాడు నేడు పేరుతో పాఠశాలలను బాగుచేసి విద్యార్థులకు సౌకర్యం కల్పించిందన్నారు. మండలంలోని తొమ్మిది పాఠశాలలకు 340 ట్యాబ్‌లను అందజేశారు, కార్యక్రమంలో ఎంఇఒలు జి.సూర్యదేముడు, ఎం.వెంకటరమణ, ఎంపిపి బి.రమణమ్మ, శ్రీరామ నాయుడు, జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, వైసిపి మండల కన్వీనర్‌ బి.చిట్టిరాజు, సర్పంచ్‌ సాంబన్న దొర, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సీతంపేట : మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఎంపిపి ఆదినారాయణ ట్యాబులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ విద్యార్థులు ట్యాబులను వినియోగించుకోవాలని కోరారు. వీటి ద్వారా విద్యార్థులు మంచి సబ్జెక్టు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఇఒ ఆనందరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️