వైవీయూ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌

ప్రజాశక్తి-కడప అర్బన్‌కడపలోని యోగి వేమన విశ్వ విద్యా లయంలో విద్యార్థులు అన్వన్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి వైవీయూ వసతి గహంలో భోజనం చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు, విరోచనాలు చేసుకొని అన్వస్థతకుగురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లనే అన్వస్థతకు గురయ్యారు. వైవీయూ వనతి గహంలో ప్రత్రిరోజు విద్యార్థులు రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు భోజనం చేస్తారు. రాత్రి భోజనంలో అన్నం, వంకాయ కూర, రసం, పెరుగును విద్యార్థులకు వసతి గహంలో వడ్డించారు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి బోజనం చేసిన విద్యార్థులు 10.30 గంటల ప్రాం తంలో అన్వస్థతకు గురయ్యారు. 10 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకొని అన్వన్థతకు గురికాగా వెంటనే వైవీయూ అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించి అత్యవసర విభా గంలో వైద్య సేవలు అందించారు. విద్యార్థులతోపాటే రిమ్స్‌కు వైవీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య చింతా సుధాకర్‌, కళాశాల ప్రిన్సిపల్‌ రఘనాధరెడ్డి చేరుకొని రాత్రంతా విద్యార్థుల దగ్గరే ఉండిపోయారు. విద్యార్థులు కోలుకోవడంతో గురు వారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈలోగా వైవీయూ వసతి గహంలో 8 గంటల ప్రాంతంలో మరో 19 మంది విద్యార్థులు వాం తులు, విరేచ నాలతో కావడంతో రిమ్స్‌కు తరలించి చికిత్స అంది స్తున్నారు. వారిని కూడా హుటా హుటిన విద్యార్థుల సమాచారాన్ని వైవీయూ అధికా రులువారి తల్లి దండ్రులకు చేర వేశారు. విద్యార్థులు కలుషిత ఆహారం తినడం వల్లే వుడ్‌ఫాయిజన్‌కు గురయ్యారు. వైవీయూ వసతి గహంలో విద్యా ర్థులకు నాసిరక భోజనం వడ్డి స్తున్నారని గతంలో పలు మార్లు విద్యార్థి నంఘాలు ఆందోళన బాట వట్టిన విషయం విధితమే. వారా నికి ఒక్కసారి వైవీయూ ప్రిన్సివల్‌ రఘునాథరెడ్డి హాస్టల్‌ను తనిఖీ చేసి భోజన పదార్థాల నాణ్యతను పరిశీంచినట్లు తెలుస్తోంది. అయితే హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. వారి పర్యవేక్షణ లేకపోవడం వల్ల హాస్టల్‌ నిర్వహణ సక్రమంగా సాగడంలేదని తెలుస్తోంది.మెరుగైన వైద్యం అందించాలి : విద్యార్థి సంఘాలు వైవీయూలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర యూనివర్శిటీ కో- కన్వీనర్‌ ఎం.ఆర్‌.నాయక్‌, ఆర్‌విఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మల్లెల జగదీష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం 500 మంది విద్యార్థులతో యూని వర్శిటీ మెయిన్‌ గేటు ఎదుట ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాలతో చల గాటం ఆడవద్దని డిమాండ్‌ చేశారు. వెంటనే ఫుడ్‌ పాయిజన్‌కు గల కారణాలు తెలుసుకోవాలని చెప్పారు. అధికారులు అవినీతి, ఆక్రమాలకు పాల్ప డుతూ విద్యార్థుల సంక్షేమాన్ని గాలికివదిలేశారని విమర్శించారు. విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత, శుభ్రత లేకపోవడంతో ఈ సమస్య వచ్చిందని పేర్కొన్నారు. విసి, రిజిస్టార్‌ దృష్టికి తీసు కువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తినడానికి వచ్చారా.. చదువు కోవ డానికి వచ్చారా’ అంటూ విద్యార్థులను వార్డెన్లు బెరి స్తున్నారని తెలిపారు. యూనివర్శిటీ హెల్త్‌ సెంట ర్‌లో మహిళా డాక్టర్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బ ందులు పడుతున్నారని చెప్పారు. సెమిస్టర్‌ పరీక్షలు రాయాల్సిన వారు అస్వస్థతకు గురి కావడంతో రాయలేక పోయారని, పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. విద్యా ర్థుల ప్రాణాలకు నష్టం వాటిల్లితే యూని వర్శిటీ అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో నిరాహార దీక్షలు చేస్తామని పేర్కొన్నారు.

➡️