వైసిపి నియంతృత్వాన్ని భరించలేకే టిడిపిలోకి చేరికలు: డాక్టర్‌ ఉగ్ర

ప్రజాశక్తి-వెలిగండ్ల రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్ని ఉన్న నియంతృత్వ పోకడలను భరించలేక ఎంతోమంది అధికార పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. వెలిగండ్ల మండలంలోని వెదుళ చెరువు గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాల నుంచి 20 మంది కనిగిరి నియోజకవర్గ టిడిపి సీనియర్‌ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్యామల కాశిరెడ్డి ఆధ్వర్యంలో కత్తిపోగు మార్క్‌, తగరం ఏ ప్రేమ్‌, తగరం లోకయ్య, జాండ్రపల్లి గుంటయ్య కుటుంబాలకు చెందిన 20 మంది కనిగిరి అమరావతి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గపు ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షం లో చేరారు. వీరిని డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామన్న రాజ్యం తిరిగి సాధించడం కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలన్నారు. కనిగిరి ప్రాంతం అభివృద్ధి పథంలో నడవాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవా ల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. గతంలో కనిగిరిలో అధికార పార్టీకి ఓటు వేసి మోసపోయిన ప్రతి ఒక్కరూ తిరిగి టిడిపి లోకి చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, మండల బీసీ సెల్‌ అధికార ప్రతినిధి సంపతి రాజగోపాల్‌, తగరం అంకయ్య పాల్గొన్నారు. కనిగిరి: కనిగిరి ప్రధాన రహదారుల్లో మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం కనిగిరి ప్రజలతో కలిసి సందడిగా తిరిగారు. నాజ్‌ సెంటర్‌, ఎమ్మెస్సార్‌ రోడ్‌, శ్రీనివాస హాల్‌ రోడ్‌ సెంటర్లో ఉన్న ప్రజలను, స్నేహితులను, కార్యకర్తలను, నాయకులను పలకరించుకుంటూ వెళ్లారు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూనే టీ తాగారు. వెనకబడిన కనిగిరి ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు డాక్టర్‌ ఉగ్ర తెలిపారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ చినమస్తాన్‌, ఆర్యవైశ్య నాయకులు కోట సురేష్‌ కుమార్‌, కొరిపర్తి మారుతి కుమార్‌, కొప్పరపు సత్యాలు, ఓలేటి చిన్న, వెలుగురి చంద్రశేఖర్‌, రాచపూడి వెంకటేశ్వర్లు, అద్దంకి చిన్నబాబు, గోనుగుంట శ్రీనివాసులు, మామిడి రమేష్‌ ఇతర పట్టణ ప్రముఖులతో కలిసి సరదాగా మాట్లాడారు. పామూరు: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపితోనే సాధ్యమవుతుందని కనిగిరి మాజీ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోడిగుప్పల గ్రామంలో టిడిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతి కార్యకర్త గట్టి కృషి చేసి టిడిపి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని కోరారు. యువతకి ఉద్యోగ అవకాశాలు టిడిపితోనే సాధ్యమవుతాయన్నారు. జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశారని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను ఇబ్బందులు గురిచేసిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అనంతరం కోడిగుంపల నాయకులు, ఉగ్ర నరసింహారెడ్డికి పారిశ్రామికవేత్త కోటపాటి జనార్దన్‌ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దిద్దుకూరి పేరయ్య, దుద్దుకూరు వెంకటస్వామి, కే సురేష్‌, ఎం రమణయ్య, వీరబాబు, అడుసుమల్లి ప్రభాకర్‌, హుస్సేన్‌ రావుయాదవ్‌, రహంతుల్లా, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️