వైసిపి నుంచి టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-వెలిగండ్ల: మండల కేంద్రమైన వెలిగండ్లలో వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి బీసీ నాయకులు వెలిగండ్ల మండల క్లస్టర్‌ ఇన్‌ఛార్జి కారంపూడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం కనిగిరిలోనే తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ వైసీపీలో బీసీలకు తగిన న్యాయం జరగలేదని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వారికి నిధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మోసం చేశారని, గత టిడిపి హయాంలో బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి బీసీలకు అనేక పరికరాలు చేసి, బ్యాంకుల్లో రుణాలు ఇచ్చి స్వతంత్రంగా వారి కాళ్ల మీద నిలబడేటట్లు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. పార్టీలో రాయల కాశి, ఆయళ్ళ మాలకొండయ్య, బొప్పరాజు చిన్న పుల్లయ్య, బొప్పరాజు, కథ పుల్లయ్య, రాయల నర్సింహులతో పాటు మరికొందరు చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు టి సుబ్రమణ్యం, సలోమను పాల్గొన్నారు.

➡️