సన్న, చిన్న కారు రైతులకు పట్టాలివ్వండి

జాయింట్‌ కలెక్టర్‌కి వినతిపత్రం అందజేస్తున్న ఏపూరి గోపాలరావు

పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణ శివారులో గల ఎర్రవాగు పోరంబోకు డి నెంబర్‌ 309/2ఎ లో భూములు సాగు చేసుకుంటున్న సన్న, చిన్న కారు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ 42 సంవత్సరాలుగా దాదాపు 40 మంది సన్న చిన్న కారు రైతులు ఈ భూములు సాగు చేసుకుంటూ కుటుంబాలు గడుపుకుంటున్నారని చెప్పారు. వీరంతా బీసీ, ఎస్టీ సామా జిక వర్గాలకు చెందిన పేద రైతులు, రెక్కల కష్టం పై ఆధారపడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఇదే సమయంలో స్థానికంగా ఒక రియల్‌ ఎస్టేట్‌ యజ మాని ఈ పొలాల్లో గుండా రోడ్డు వేసేందుకు ప్రయత్నం చేస్తూ వీరు పొట్ట కొట్టేందుకు ప్రయ త్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్టర్‌ పై చర్యలు తీసుకోవాలని, ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులు సంపత్‌ వెంకటకష్ణ, వడితే వశ్రాం నాయక్‌, మాడావత్‌ లక్ష్మానాయక్‌, సంపతి శీను తదితరులు పాల్గొన్నారు

➡️