సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె నోటీసు

Dec 1,2023 21:57

 ప్రజాశక్తి-నెల్లిమర్ల :   ఈ నెల 20 నుంచి సమ్మెకు దిగుతామని సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె నోటీసును ఎంఇఒకు శుక్రవారం అందజేశారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద 4న ఆవేదన దీక్ష చేపడుతున్నట్లు వారు తెలిపారు. మూడు నెలలుగా జీతాలు లేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.డెంకాడ : ఎంఇఒ వెంకటరమణకు సమగ్ర శిక్ష ఉద్యోగులు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు. రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, తదితర డిమాండ్లతో ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆ ఫెడరేషన్‌ జెఎసి నాయకులు భాస్కరరావు, శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, నాయుడు, సంతోష్‌, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

➡️