సమ్మెను ఉధృతం చేస్తాం

ప్రజాశక్తి-కడప అర్బన్‌ అంగన్వాడీల సమస్యలు పరిష్కరి ంచాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం రాజీవ్‌పార్కు రోడ్డులో మానవహారం నిర్వహించారు. మానవహారానికి సిఐటియు జిల్లా, నగర ప్రధాన కార్యదర్శులు మనోహర్‌, వెంకట సుబ్బయ్య, సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు అంగన్వాడీల సమ్మె విరమి ంచేది లేదని హెచ్చరించారు. గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. మొండి వైఖరి వీడి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సమ్మె మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూని యన్‌ నాయకులు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొ న్నారు. ముద్దనూరు : అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను తీర్చాలని స్థానిక తహశీల్దార్‌ కార్యాల యం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె సోమవారం 7వ రోజుకు చేరు కుంది. సమ్మె శిబిరం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా నిలిచారు. మైదుకూరు : ముఖ్యమంత్రి జగన్మోహ న్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శివకుమార్‌ అన్నారు. అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం మైదుకూరు ఎంపిడిఒ కార్యాలయం నుంచి రాయల సర్కిల్‌ వరకు ర్యాలీగా వచ్చి మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుధాకర్‌, షరీఫ్‌, గుర్రయ, రవి, రాజా, జహంగీర్‌ భాష, సమ్మెలో సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు నాయకులు గంగావతి, చెన్నమ్మ, ధనలక్ష్మి పాల్గొన్నారు. పోరుమామిళ్ల : అంగన్వాడీల డిమాం డ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌. భైరవ ప్రసాద్‌ పేర్కొ న్నారు. అంగన్వాడీలు అంబేద్కర్‌ విగ్రహం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన తెలియ జేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు కార్య దర్శి మేరీ, దస్తగిరిమ్మ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఓబులాపురం విజయమ్మ, రేణుక, జ్యోతిమ్మ, రమాదేవి, శ్రీదేవి, లక్ష్మీదేవి, అంగన్వాడీ కార్మికులు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.దువ్వూరు : స్థానిక తహశీల్దార్‌ కార్యాల యం ఎదుట సమ్మె అంగన్వాడీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీతో సమ్మె నిర్వహించారు. వారి ఆందోళనకు మైదుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ సంఘీవం తెలియజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ బోర్‌ రెడ్డి రమ ణారెడ్డి, కారపు రెడ్డి సంజీవరెడ్డి, తహీర్‌ హుస్సేన్‌, మండల నాయకులు పాల్గొన్నారు వేంపల్లె : అంగన్వాడీ మహిళాలను వైసిపి ప్రభుత్వం రోడ్డుపైకి లాగడం శోచనీయమని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి, ఫైనాన్స్‌ కార్పొ రషన్‌ మాజీ డైరెక్టర్‌ మహమ్మద్‌ షబ్బీర్‌ అన్నారు. 7 రోజుల నుంచి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు. అంగ న్వాడీలు విన్నూతంగా చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలియజేశారు. అనంత రం అంగన్వాడీలకు టిడిపి ఆధ్వర్యంలో బిస్కెట్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అల్లాబకష్‌, ఆర్‌.వి రమేష్‌, మహబూబ్‌ షరీఫ్‌, ఇలియాస్‌, వెంకటయ్య, జిలాన్‌, తిప్పారెడ్డి, లాడెన్‌ బాష, రమణ, సిఐటియు నాయకులు లలితా దేవి, సావిత్రి, ఎఐటియుసి నాయకులు సరస్వతి, శైలజాతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొ న్నారు. బద్వేలు : అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు బద్వేల్‌ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సమగ్ర శిశు అభివద్ధి అధికారిని (సిడిపిఓ) కార్యాల యం నుంచి సిద్ధవటం రోడ్డు ఎన్‌జిఒ కాలనీ, వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మానవహారం ఏర్పడి తమ నిరసన తెలియజేశారు. అంగన్వాడీల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించి మాట్లాడారు. అంగన్వా డీలతోపాటు సామాన్య జనాన్ని కూడా ముఖ్య మంత్రి మోసం చేశారని, అంగన్వాడీలను నిరంత రమూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. వైసిపి ప్రభు త్వానికి గట్టి సమాధానం చెప్పాలని సూచిం చారు. తాము ఆడవాళ్ళం కాదు మహాశక్తులమని గుర్తించేలా చేయాలన్నారు. కార్యక్రమంలో తెలు గుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కెవి సుబ్బారెడ్డి, ఎస్‌. మనోహర్‌ రెడ్డి, తెలుగు యువత జిల్లా నాయకులు ఎస్‌. జహంగీర్‌బాష, సిపిఐ పట్టణ కార్యదర్శి పి. బాల బాబయ్య, ఎఐటియుసి ఏరియా కార్యదర్శి పి. వెంకటరమణ, పట్టణ అధ్యక్ష, కార్య దర్శులు నగేష్‌,న రసింహులు వ్యవసాయ కార్మిక సంఘం గోపురం మండల నాయ కులు కదిరయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌ఎం షరీఫ్‌ జి. నాగార్జున అంగ న్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు గౌరవా ధ్యక్షురాలు కె. సుభాషిని, ప్రధాన కార్యదర్శి ఆర్‌. హుసేనమ్మ, నాయకురాళ్లు సత్యవతి, కళావతి ,విజ యమ్మ, తులసమ్మ, వెంకట నరసమ్మ, వసంతమ్మ, శ్రీలత, లీలావతి, కళావతి ,కష్ణవేణి, ప్రవీణ, ఉమా దేవి, మహాలక్ష్మి, రాధమ్మ, అరుణమ్మ పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్మికులు, ఆయాలు పాల్గొ న్నారు. ఎర్రగుంట్ల : స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం వద్ద చేస్తున్న అంగన్వాడీల నిరసన కొనసాగుతోంది. అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్‌ పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కార్యక ర్తలకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. మంలో అంగ న్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. పులి వెందుల టౌన్‌ : అంగన్వాడీలు, సహాయకులు పోరు ను రోజురోజుకూ ఉధృతం చేస్తు న్నారు. అంగ న్వాడీ కేంద్రాల తాళాలను పగల గొట్టించినా ఉద్య మాన్ని ఆపడం లేదు. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకొక కొత్త రూపం లో సమ్మెను ముందుకు తీసుకుపోతున్నారు. సోమ వారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగ న్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ సమ స్యలను ముఖ్యమంత్రి దష్టికి తీసుకువెళ్లాలని మున్సి పల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌కు వినతిపత్రం అందించారు.

➡️