సిఎంఎ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థుల ప్రతిభ

ర్యాంకులు సాధించిన విద్యార్థులతో నందకిషోర్‌

ప్రజాశక్తి-గుంటూరు : ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన సిఎంఎ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు ఆలిండియా టాప్‌ ర్యాంకులతోపాటు, అత్యధిక పాస్‌ పర్సంటేజి సాధించారని సంస్థ చైర్మన్‌ అన్నా నందకిషోర్‌ తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా సిఎ, సిఎంఎ కోర్సులలో 400లకుపైగా ఆలిండియా ర్యాంకులు సాధించామన్నారు. సిఎంఎ ఫైనల్‌ విభాగంలో పి.లోకేష్‌ ఆలిండియ 4వ ర్యాంకు, చందా పవన్‌కుమార్‌ 17వ ర్యాంకు, ఎ.పవన్‌ కళ్యాణ్‌ 31వ ర్యాంకు, డి.శ్రీహరిరెడ్డి 47వ ర్యాంకు సాధించారని తెలిపారు. అలాగే సిఎంఎ ఇంటర్‌ విభాగంలో బొల్లా పల్లవి 27వ ర్యాంకు సాధించినట్లు వెల్లడించారు. ఈ ఘనత సాధించటానికి కారణమైన అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం సహకారం ఎంతో ఉందన్నారు. టాపర్లను అన్నా నందకిషోర్‌, డైరెక్టర్‌ శ్రీలక్ష్మి, అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.

➡️