సిటియులో సైన్సు సంబరాలు

Mar 6,2024 21:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సైన్స్‌ సంబరాల్లో భాగంగా జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని గిరిజన యూనివర్శిటీలో నిర్వహించారు. బుధవారం ముఖ్య అతిథిగా ఢిల్లీ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పిసి జోషి, గౌరవ అతిథి ప్రొఫెసర్‌ పిబి హైదరాబాదు విశ్వవిద్యాలయానికి చెందిన ఎమెరిటస్‌ సైంటిస్ట్‌ కీర్తి హాజరయ్యారు. తమ జ్ఞానం మరియు అనుభవంతో సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణవ్యవస్థలో సాంప్రదాయ విజ్ఞానాన్ని సమగ్రపరచాలని, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు సాంప్రదాయ జ్ఞానంలో శిక్షణపొందాలని జోషి అన్నారు. గిరిజన యూనివర్సిటీ వైస్‌-ఛాన్సలర్‌, టి వి కట్టిమణి మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన వ్యవస్థ అంతటా విస్తరించాలన్నారు. హెడ్‌ డాక్టర్‌ పి. శ్రీదేవి ఆధ్వర్యాన బయోటెక్నాలజీ విద్యార్థులు చేసిన పూల గైడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి యువతలో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించారు. గెలుపొందిన విద్యార్థులందరికీ సైన్స్‌ డే మెడల్స్‌ అందజేశారు.

➡️