సైన్స్‌ పోటీలకు ఉపాధ్యాయురాలు ఎంపిక

టి.నరసాపురం : రాష్ట్ర స్థాయిలో జరిగే ఉపాధ్యాయ విభాగం సైన్స్‌ పోటీలకు మండలంలోని అప్పలరాజుగూడెం ఆంధ్రప్రదేశ్‌ బాలురు గురుకుల పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయురాలు సిహెచ్‌.అనురాధ ఎంపికైనట్లు మంగళవారం తెలిపారు. ‘బడ్జెట్‌ ఫ్రెండ్లీ యూవి డస్ట్‌ బిన్‌’ వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రథమ స్థానాన్ని సాధించి ఈనెల 29న కడపలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడంతో పాఠశాల ప్రిన్సిపల్‌ శంకరరావు అభినందించారు.

➡️