స్ట్రాంగ్‌ రూములు పరిశీలన

Feb 20,2024 21:29

ప్రజాశక్తి – గరుగుబిల్లి : రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మండల పరిధిలోని ఉల్లిభద్ర గ్రామ సమీపాన ఉద్యాన కళాశాలలో స్ట్రాంగ్‌ రూములను మంగళ వారం పార్వతీపురం, పాలకొండ ఆర్‌డిఒలు కె.హేమలత, రమణ పరిశీలించారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సంబంధించి ఉద్యాన కళాశాలలో ఓట్లు లెక్కింపు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేయనున్నట్టు ఆర్‌డిఒలు పేర్కొన్నారు. ఈ మేరకు ముందస్తుగా స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ నిర్వహణతో పాటు వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో డివిజనల్‌ సర్వే అధికారి కరణం సూర్యారావు, డిటిలు పెళ్లూరి సత్యలక్ష్మీకుమార్‌, తూముల వెంకటరమణ, మండల సర్వేయర్లు ఉన్నారు.

➡️