స్పందించేవరకూ సమ్మె

Dec 12,2023 21:39
జిల్లావ్యాప్తంగా నిరసన హోరుసిఐటియు సంఘీభావం

స్పందించేవరకూ సమ్మె’సర్కార్‌’పై అంగన్‌వా’ఢ’జిల్లావ్యాప్తంగా నిరసన హోరుసిఐటియు సంఘీభావంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం ‘పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్న సుప్రీంకోర్టు నిబంధనలను జగన్‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది.. తెలంగాణా కన్నా వేతనం ఎక్కువగా ఇస్తామని చెప్పిన హామీ ఏమయ్యింది..? రిటైర్మెంట్‌ అనంతరం రూ.5 లక్షలు గ్రాడ్యుటీ ఇవ్వాలి.. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి.. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలి..’ అంటూ అంగన్‌వాడీలు సర్కార్‌పై ధ్వజమెత్తారు.. అర్హులైన హెల్పర్లను వర్కర్లుగా ప్రమోషన్‌ ఇవ్వాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నినదించారు.. సర్కార్‌ స్పందించేవరకూ సమ్మె ఆగదని ఉద్ఘాటించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన హోరెత్తింది.. చర్చలు ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం తిరుపతిలో.. పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మంగళవారం అంగన్‌వాడీ కార్మికుల నిరవధిక సమ్మె శిబిరంలో వందలాదిమంది అంగన్‌వాడీలు యూనిఫాంలో పాల్గొన్నారు. అంగన్‌వాడీలపట్ల జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విమర్శించారు. సోమవారం సిఎస్‌ జవహర్‌రెడ్డితో జరిగిన చర్చలు ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఎంఎల్‌ఎలు, ఎంపిలు, మంత్రులు, ముఖ్యమంత్రి నెలకు లక్షల జీతాలు తీసుకుంటూ, మరణించేంత వరకూ పెన్షన్‌ పొందే సౌకర్యం కలిగి ఉంటూ అంగన్‌వాడీలు మాత్రం చాలీచాలని వేతనాలతో అర్ధాకలితో జీవించమని చెప్పడాన్ని దుయ్యబట్టారు. యాప్‌ల పేరిట, ప్రభుత్వ పథకాల అమలు పేరుతో తీవ్రమైన పనిభారం మోపడాన్ని గుర్తు చేశారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకూ నిరవధిక సమ్మె ఆగదని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.హరిక్రిష్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీల కష్టాన్ని అర్ధం చేసుకోకుండా ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం అర్ధం లేని చర్యని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి కె.వేణుగోపాల్‌, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ ఆర్‌.లక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతి, సిఐటియు నాయకులు మునిరాజ, ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.హేమలత, ఎఐటియుసి నేత ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు నాగరాజమ్మ, ప్రియదర్శిని, జయప్రభ, వరలక్ష్మి, సుజాత, శ్రీదేవి, శారద, అమర, గంగాభవాని, అరుణ, నాగరత్న పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో.. ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సిఐటియు, ఐఎఫ్‌టియు సంయుక్త ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెకు దిగారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, నేతలు పెనగడం గురవయ్య, అంగన్‌వాడీలు రేవతి, పుష్ప, సౌజన్య, భారతి పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే సమ్మె సత్యవేడులో.. ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆఫీసు ఆవరణలో అంగన్‌వాడీల నిరసనకు సిఐటియు డివిజన్‌ నాయకులు పాల్గొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు అనేక దఫాలు వినతిపత్రాలు ఇచ్చినా, నిరసన తెలియజేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. సమ్మె జరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 2017 నుంచి టిఎ, డిఎ పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలన్నారు. సమ్మెలో నిర్మల, శాంతి, ఇందిర, భువన, కాంతమ్మ, సుభాషిణి, అనూష, ప్రమీల పాల్గొన్నారు. నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలి పిచ్చాటూరులో…ఐసిడిఎస్‌ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమ్మెకు రైతుసంఘం అధ్యక్షులు దాసరి జనార్ధన్‌ సంఘీభావం ప్రకటించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఇంద్రాణి, కృష్ణవేణి, విజయలక్ష్మి, సావిత్రి, విజయకుమారి, వీరమ్మ, కల్యాణి, పూర్ణమ్మ, ప్రమీల, నాగభూషణమ్మ, భారతి, ప్రమీల, పద్మ, సిఐటియు నాయకులు నాగలాపురం నాగరాజు, జె.రామచంద్రారెడ్డి, ఆర్‌.మురగేష్‌, ఆర్‌.మునిశంకర్‌ పాల్గొన్నారు. రిటైర్మెంట్‌ వయస్సు 62కు పెంచాలి బిఎన్‌కండ్రిగలో..ఎంపిడిఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సర్వీసులో ఉండగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు చనిపోతే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తూ బీమా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ వయస్సు 62కు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. శోభ, కె.సుదర్శన నాయకత్వం వహించారు. ఆర్డీవోకు వినతి గూడూరు టౌన్‌లో… సబ్‌కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు జోగి శివకుమార్‌, బివి రమణయ్య, ఎస్‌.సురేష్‌, బి.గోపీనాధ్‌, ఎ.ప్రసాద్‌, బి.చంద్రయ్య సంఘీభావం ప్రకటించారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గూడూరు ఆర్డీవో ఎఒకు అందించారు. ఈక ఆర్యక్రమంలో అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఎ.ఇంద్రావతి, కార్యదర్శి బిఎస్‌.ప్రభావతి, ఎస్‌కె ఆసియా, ఎస్‌.లక్ష్మి, హైమావతి, ఈశ్వరమ్మ, ఎస్‌.ప్రసన్న పాల్గొన్నారు. రేణిగుంటలో… ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు కె.హరినాథ్‌, నరసింహారెడ్డి, వెంకటరమణ, కుప్పస్వామి, సెల్వరాజ్‌, కాంగ్రెస్‌ ఒబిసి జిల్లా అధ్యక్షులు చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ధనమ్మ, రాధ, భారతి, అంబిక, పాండురంగమ్మ, భాగ్య, లక్ష్మి, విజయ, ప్రభావతి, ధరణి, పార్వతి, రేఖ పాల్గొన్నారు. వెంకటగిరిలో… బంగారుపేట ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మెబాట పట్టారు. సిఐటియు నాయకులు వడ్డిపల్లి చెంగయ్య, ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఎన్‌.స్వరూపరాణి, మంజుల నాయకత్వం వహించారు. నిరసన కార్యక్రమంలో 250మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో..సిఐటియు నాయకులు ఎస్‌.సాంబశివయ్య, పి.మనోహర్‌ మద్దతు ప్రకటించారు. మేకల హైమావతి నాయకత్వంలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ రద్దు చేయాలి చంద్రగిరిలో…అంగన్‌వాడీలకు భారంగా ఉన్న ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ రద్దు చేయాలని యూనియన్‌ జిల్లా కార్యదర్శి వాణీశ్రీ డిమాండ్‌చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే అనివార్య పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామన్నారు. సమ్మె ఎలా భగం చేయాలని అధికారులతో ఒత్తిడి చేస్తున్నదే తప్ప, సమస్యలు ఎలా పరిష్కారం చేద్దామనే ఆలోచనలో లేకపోవడం దుర్మార్గమన్నారు.ఈ కార్యక్రమంలో నాగభూషణమ్మ, లీల పాల్గొన్నారు. నాయుడుపేటలో.. ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ, సిఐటియు జిల్లా నాయకులు శివకవి నేతృత్వంలో సమ్మె ప్రారంభమయ్యింది. నాయకులు సంధ్య, కళావతి, విజయ, సుకుమారి, మేరి, ప్రమీల, మునిరత్నమ్మ పాల్గొన్నారు. నిరసన ర్యాలీ పుత్తూరు టౌన్‌లో..అంగన్‌వాడీ వర్కర్లకు కనీస వేతనం పెంచాలని యూనియన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, ఐసిడిఎస్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటేష్‌ సంఘీభావం ప్రకటించారు. నాయకులు ఎస్‌.పురుషోత్తం, కెఆర్‌ సుబ్రమణ్యం, ఎ.విజరు, రమేష్‌, యాసిన్‌బాష, బాబు, వర్కర్లు మునికుమారి, విజయకుమారి, హైమావతి, ధనమ్మ, రాధ, అన్నపూర్ణ, అంబిక, గంగులమ్మ, పద్మజ పాల్గొన్నారు.

➡️