హామీలు అమలు చేయాల్సిందే

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పాదయాత్రలో మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ బుధవారం రెండవ రోజు నిరసన ర్యాలీ చేపట్టారు. సమ్మెకు దండోరా జాతీయ నాయకులు ఎస్‌.రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.రామచంద్ర సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో, అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఇచ్చిన హామీల అమలు చేయాలని కోరారు. మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ (ఆప్కాస్‌) కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. నీటి సరఫరా, వీధి లైట్లు, యుజిడి కార్మికుల స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలన్నారు.ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌, హెల్త్‌ అలవెన్స్లు అమలు చేయాలని కోరారు. జిఒ 7 ప్రకారం క్లాప్‌ ఆటోల డ్రైవర్లకు నెలకు రూ.18,500లు జీతం ఇవ్వాలని, ఆప్కాస్‌ కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యూటీ, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. పర్మినెంట్‌ ఉద్యోగులకు సిపిఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ ఇవ్వాలని కోరారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌ యూనిఫారం, చెప్పులు, సరెండర్‌ లీవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ తాశీల్దార్‌ కు వినతి పత్రం అందించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ యానియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, సి.రాంబాబు, అగ్గిరామయ్య, తిరుపాల్‌, మంగమ్మ, ఉమా, రమణమ్మ, వై.వెంకటరమణ, సురేష్‌, శ్రీకాంత్‌, అశోక్‌, శిద్దముల్లు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా రెండవ రోజు పురపాలక కార్యాలయం ఎదుట సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ఒంటికాలి పై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు.

➡️