Nov 25,2023 19:27
జనసేన-టీడీపీ ఆత్మీయ పలకరింపు

సన్మానిస్తున్న దృశ్యం
జనసేన-టీడీపీ ఆత్మీయ పలకరింపు
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:
నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మామిడాల మధు ఇంటికి సోమవారం జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి , నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజరుబాబు , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రామిరెడ్డి 3వ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ శ్రీకాంత్‌ తదితరులు వెళ్లారు. వారికి మామిడాల మధు ఆత్మీయ స్వాగతం పలికారు. తొలుత శాలువాలతో ఘనంగా సన్మానించారు. జనసేన – టీడీపీ కలయికలో భాగంగా ప్రతిరోజూ టీడీపీ నేతల ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతుంది. పలు రాజకీయ అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దిశగా అడుగులు వేద్దామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 3,4 వ డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️