12వ రోజు అంగన్‌వాడీల నిరసన దీక్షలు

12వ రోజు అంగన్‌వాడీల నిరసన దీక్షలు

అంగన్‌వాడీల సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. పలుచోట్ల వంటా వార్పు నిర్వహించారు.ప్రజాశక్తి – యంత్రాంగంరాజమహేంద్రవరం సబ్‌ కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు ఒంటి కాలిపై నిలబడి, ఆకులు తింటూ నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాజమండ్రి ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు కె.శారద, సునీత మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీలతో చర్చించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో క్రిస్మస్‌ అనంతరం ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు. ఉండ్రాజవరం తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, చివటం ఎంపిటిసి వేముల వెంకట సత్యనారాయణ అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు. గోపాలపురం ఎంపిడిఒ కార్యాలయం వద్ద సిఐటియు మండల అధ్యక్షురాలు రామలక్ష్మి మాట్లాడారు. చాగల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద శిబిరంలో పి.విజరు కుమారి, కె.లక్ష్మి మాట్లాడారు. కె.దమయంతి, ఎ.శ్రీదేవి, ఎస్‌.అరుణ కుమారి పాల్గొన్నారు.గోకవర తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మెకు టిడిపి నాయకులు పాలూరి బోసు బాబు, గునిపే భరత్‌, పోసిన ప్రసాద్‌ అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు. వారికి వంటా వార్పునకు సంబంధించిన నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్‌ నాయకులు ఆచంట రాజు, కొంగరపు రాజు, చీకట్ల రాజు, రాపాక వీరబాబు, ఇజ్జిన బుజ్జి, జక్కల చిన్ని పాల్గొన్నారు.కొవ్వూరు రూరల్‌ ఆర్‌డిఒ కార్యాలయం శిబిరం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలపారు. మా చెవిలో పువ్వులు పెట్టొద్దు.. అయ్యా జగన్మోహన్‌ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి.. మీరు పెంచిన ధరలు లెక్కేసి మాకు వేతనాలు పెంచండి.. అంటూ శిబిరంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర బాబు, వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యాంబ మాట్లాడారు. సమ్మెకు కొవ్వూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధ్యక్షులు సిహెచ్‌విఎల్‌.పుష్పావతి, బి.పద్మావతి, ఎస్‌.ఉష, సిహెచ్‌.భవాని, డి.అమరావతి, బి.వసంత, ఎ.నరసమాంబ, ఎన్‌.శాంతకుమారి, వి.శ్రీదేవి, ఎన్‌.వెంకాయమ్మ, వి.మధురవల్లి పాల్గొన్నారు.పెరవలి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గంటి కృష్ణ మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి కె.కృష్ణవేణి, సహాయ కార్యదర్శి బి.నాగవేణి, సెక్టార్‌ లీడర్స్‌ సిహెచ్‌.విశాలి, వి.నిర్మల, కన్యాకుమారి, ఎస్‌.రాణి, ఎన్‌.శాంత కుమారి, బి.రామలక్ష్మి, పి.లకీëదుర్గ పాల్గొన్నారు.సీతానగరం బస్టాండ్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. సమ్మెకు సిపిఐ ఎంఎల్‌ నాయకులు పలివెల వీరబాబు మద్దతు తెలిపారు. సూపర్వైజర్‌ సుబ్బలక్ష్మి, మండల అధ్యక్షురాలు సిహెచ్‌ సువర్ణ, సెక్టార్‌ లీడర్లు సుభాషిణి, ఉమాదేవి, ప్రశాంతి, వెంకట లక్ష్మి, వెంకటేశ్వరి పాల్గొన్నారు.దేవరపల్లిలో అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు సందర్శించి మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపిపి కెవిపి.దుర్గారావు మాట్లాడారు. యూనియన్‌ నాయకులు టివి.లక్ష్మి, సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌, యూనియన్‌ నాయకులు ఎ.పద్మకామేశ్వరి, కొమ్మిరెడ్డి బలుసు కుమారి, టి.సంధ్య, కె.కుమారి పాల్గొన్నారు.

➡️