ప్రజాశక్తి-శింగరాయకొండ : మండల పరిధిలోని పాకల గ్రామంలో సముద్ర తీరం వద్ద నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు మానవత మండల శాఖ ఆధ్వర్యంలోబుధవారం నిత్యావసరాలు అందజేశారు. నిరుపేద మత్స్యకారులకు బియ్యం, కందిపప్పు, నూనె పాకెట్లు, చింతపండు, దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ బి. హరిబాబు, సర్పంచి సైకం చంద్రశేఖర్‌, మందలపు బాబూ రావు, న్యాయవాది బక్కముంతల వెంకటేశ్వర్లు, మానవత సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి, బిఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి మందలపు బాబూరావు , మానవత సంస్థ చైర్మన్‌ జెట్టి సూర్య చంద్రశేఖర్‌ రెడ్డి, అధ్యక్షుడు పాకల కోటేశ్వరరావు , కోటపాటి నారాయణ, ఎం.నరసింహారావు, సునీల్‌ రెడ్డి , పాకల రాఘవరావు , ఆళ్ల రమణారెడ్డి, భాస్కర్‌ పాల్గొన్నారు.

➡️