ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

చిత్తూరు : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం), వీవీప్యాట్‌ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. శనివారం చిత్తూరు కలెక్టరేట్‌ లోని ఈవీఎం, వీవీప్యాట్‌ గోదాము ను జిల్లా కలెక్టర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ … ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్‌ గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును త్రైమాసిక తనిఖీల్లో భాగంగా నిశితంగా పరిశీలించినట్లు వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తతతో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీ ప్రక్రియలో డీఆర్‌ఓ బి.పుల్లయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌- పరదేశి, టి డి పి- సురేంద్ర కుమార్‌, బి జె పి అట్లూరి శ్రీనివాసులు, వైసిపి ఉదరు కుమార్‌, సిపిఎం-గంగరాజు, ఎలక్షన్స్‌ సెల్‌ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

➡️