ప్రతి గ్రామంలో ఒక ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలి 

Jan 15,2024 16:53 #DYFI, #Kurnool
  • డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న

ప్రజాశక్తి – కర్నూలు క్రైమ్ : ప్రతి గ్రామంలో ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు.
కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంటు మగింపు కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామంలో యువత కోసం ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో యువతని మోసం చేస్తుందని అన్నారు. ఆడడానికి చిన్న స్థలమే లేని వాళ్ళు రాష్ట్రస్థాయిలో ఎలా ఆటలు ఆడాలని ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టే ప్రభుత్వానికి చిన్న ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలనే ఇంకిత జ్ఞానం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆడుదాం ఆంధ్రకు హాజరయ్యే క్రీడాకారులకు అన్ని రకాల అట వస్తువులు రవాణా చార్జీలు వసతి సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించాలని అన్నారు. డివైఎఫ్ఐ 44 సంవత్సరాల చరిత్రలో అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. అనేక పోరాటాలకు త్యాగాలకు నిలయంగా ఉందని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా యువతకు అండగా ఉద్యమాలు నడిపిన చరిత్ర డివైఎఫ్ఐకి ఉంది అన్నారు. యువతను మోసం చేసే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి యువత ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ గ్రామ కార్యదర్శి కిషన్ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి అంజి నాయకులు రాము రఘువరన్ శివ శ్రీకాంత్ చాణిక్య చాంద్బాషా చరణ్ గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️