మొక్కు తీర్చుకున్న టిడిపి అభిమాని

Jun 18,2024 13:37 #Konaseema, #TDP fan

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొత్తపేట నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేగా బండారు సత్యానందరావు అత్యంత మెజార్టీతో విజయం సాధించడంతో మండలంలోని జన్నాడకు చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని మేడపాటి రామారెడ్డి జాతీయ రహదారి చెంతన ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం మొక్కులు తీర్చుకున్నారు. ముందుగా స్వామివారికి ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయం బయట 108 టెంకాయలు కొట్టి మొక్కుతీర్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కఅషి చేసిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడి శ్రీనివాసరెడ్డి (బట్టీశీను), గొడవర్తి దుర్గాప్రసాద్‌ (బాబి), ద్వారంపూడి సతీష్‌ రెడ్డి, సత్తి శ్రీనివాస రెడ్డి, పడాల శివారెడ్డి, నాండ్ర ఆదినారాయణ రెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి (మాసారం శ్రీను), సత్తి సుబ్బారెడ్డి, దేవగుప్త సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

➡️