సామాజిక చలనాలను పసిగట్టే కాయితాల రుజువు కథల సంపుటి

Apr 8,2024 00:19

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వరలక్ష్మి, తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
ప్రస్తుత వ్యవస్థల, పాలక వర్గాల నిర్బంధాలను లెక్క చేయకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం రచనలు చేస్తున్న నల్లూరి రుక్మిణి ప్రస్ఫుటిస్తున్నాయని అరుణతార పత్రిక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.వరలక్ష్మి పేర్కొన్నారు. ప్రముఖ రచయిత్రి రుక్మిణి రచించిన ‘కాయితాల రుజువు’ కథా సంపుటి ఆవిష్కరణ, పరిచయ సభ ఆదివారం స్థానిక బ్రాడీపేట యుటిఎఫ్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ముఖ్యవక్తగా పాల్గొన్న వరలక్ష్మి మాట్లాడుతూ విప్లవ రచయితలను, మేధావులను, తీవ్ర నిర్బంధాలకు గురిచేస్తున్న నేపథ్యంలో ఏమాత్రం వెరవకుండా స్పష్టంగా తాను చెప్పదలుచుకున్న విషయాలకు దర్పణం ఈకథల పరిచయం పుస్తకం అన్నారు.వర్తమాన సామాజిక సమాజంలో ఫైనాన్స్‌ పెట్టుబడి చేస్తున్న విధ్వంసాన్ని, సంక్షోభాన్ని, కుటుంబ జీవితాల్లోని మనుషుల వ్యక్తిత్వాలను, వెతలను కథల సంపుటి కళ్ళకు కట్టుతున్నదని తెలిపారు. ఉపాధ్యాయుడు మోదుగుల రవికష్ణ మాట్లాడుతూ సమకాలిన సమస్యలకు శ్వేత పత్రం లాంటిది కాయితాల రుజువు పుస్తకం అన్నారు. సభాధ్యక్షులు, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లా డుతూ ‘ఢ ధీ రణ’, ‘మరణానంతర జీవితం’, ‘కంపెనీ తిరణాల’ వంటి కథలు ద్వారా రచయిత్రి రుక్మిణి రాసిన ‘కాయితాల రుజువు’ కథల సంపుటి ఆలోచనలను రేకెత్తిస్తుందని తెలియజేశారు.కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్‌, విరసం సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, కాపు శ్రీనివాసరావు, ప్రొఫెసర్‌ వేణుగోపాలరావు, పలువురు రచయి తలు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

➡️