అభివృద్ధి పనులు వేగవంతం

Jun 27,2024 00:34 #Bheemili Mandala samavesam
BHeemili mandal Samavesm

 ప్రజాశక్తి -భీమునిపట్నం : మండలంలో ఇప్పటికే పూర్తికావచ్చిన పలు అభివృద్ధి పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తిచేయాలని, ప్రారంభకాని పనులను ప్రారంభించాలని ఎంపిపి దంతులూరి వెంకట శివ సూర్య నారాయణ రాజు (వాసు రాజు) సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంపిపి అధ్యక్షతన బుధవారం ఎండిఒ కార్యాలయంలో మండల పరిషత్‌ సభ్యుల సాధారణ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలు, విభాగాల వారీగా అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఎంఇఒ ఎం.శివరాణి మాట్లాడుతూ మండలం, జివిఎంసి పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 55 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. 20 పాఠశాలలు ఒకే టీచర్‌తో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న జిఒ 117 ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒకే టీచర్‌ 5 తరగతులు బోధించడం చాలా ఇబ్బంది అని తెలిపారు. 21 నుంచి 60 మందికి ఇద్దరు ఉపాధ్యాయులు బోధించడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ఎపిఒ జివి.గౌరి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద ఏడాది కాలంలో కూలీలకు 89 వేల పని దినాలు కల్పించామని తెలిపారు. హౌసింగ్‌ ఎఇ ఎం.హుస్సేన్‌ మాట్లాడుతూ, గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యాన మండలం, జివిఎంసి నాల్గో వార్డు (5 విలీన పంచాయతీలు)లో 2075 ఇళ్లకు గాను ఇప్పటి వరకు 884 పూర్తయినట్లు చెప్పారు. వివిధ దశల్లో ఉన్న వాటిని గడువు లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తాళ్లవలస పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జునరావు మాట్లాడుతూ, తమ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో మందులు, ఎఆర్‌వి, ఎఎస్‌వి ఉన్నాయని వివరించారు. వైస్‌ ఎంపిపిలు బి.బంగారు నాయుడు, ఎస్‌.దుర్గాలమ్మ, ఎండిఒ డాక్టర్‌ వి.జానకి, తహశీల్దార్‌ టి.గోవింద పాల్గొన్నారు.భీమిలి మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి వాసు రాజు

➡️