ఓటరు జాబితా పరిశీలనలో అదితి

Apr 4,2024 21:40

 ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం నియోజకవర్గం క్లస్టర్‌ 3 , 4 పరిధిలో గల వార్డు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేటర్‌ అభ్యర్థులు, యూనిట్‌ ఇంచార్జ్‌, బూత్‌ ఇంఛార్జిలతో టిడిపి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఓటరు వెరిఫికేషన్‌, కుటుంబ సాధికార సారధుల నియామకం పూర్తి చేయడం, 85 ఏళ్లు దాటిన ఓటర్లను గుర్తించి వివరాలు సేకరించడం, డబుల్‌ ఎంట్రీ ఓటర్లు గుర్తించడం , 18 – 24 సంవత్సరాల వయసు గల కొత్త ఓటర్లను గుర్తించి సదరు వివరాలు త్వరగా పార్టీ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. సమావేశంలో నగర పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు , 3, 4 క్లస్టర్‌ ఇంఛార్జులు పాల్గొన్నారు.

➡️