ఓటు హక్కును వినియోగించుకోవాలి

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, పిఒ

ప్రజాశక్తి-పాడేరు:ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సూచించారు. ఈ మేరకు పది రకాల గోడ పత్రికలను శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాటాడుతూ, ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటరు ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. ముఖ్యంగా యువత, వృద్దులు, దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లు ఓటింగ్‌లో పాల్గొవాలని సూచించారు. ఈ గోడ పత్రికలను ఆన్ని బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్ళలో ఏర్పాటు చేయాలని స్వీప్‌ నోడల్‌ అధికారి వివిఎస్‌ శర్మను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ భావన వశిస్ట్‌, సబ్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి పాల్గొన్నారు.పాడేరు: పాడేరులో శుక్రవారం ‘ఓటు హక్కుపై దివ్యాంగులతో ర్యాలీ కలెక్టర్‌ విజయ సునీత ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించు కోవాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో జాయింట్‌ కలక్టర్‌ భావన వశిష్ట్‌, పిఒ అభిషేక్‌, సబ్‌ కలక్టర్‌ దాత్రిరెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు మాధవి, ఎస్‌ డబ్ల్యుఇపి కో ఆర్డినేటర్‌ వివిఎస్‌ శర్మ, మైక్రో ఇరిగేషన్‌ అధికారి రహీం పాల్గొన్నారు.ఓటు హక్కును వినియోగించుకోవాలి కలెక్టర్‌ విజయ సునీతప్రజాశక్తి-పాడేరు:ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత సూచించారు. ఈ మేరకు పది రకాల గోడ పత్రికలను శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాటాడుతూ, ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటరు ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. ముఖ్యంగా యువత, వృద్దులు, దివ్యాంగులు, ట్రాన్స్‌ జెండర్లు ఓటింగ్‌లో పాల్గొవాలని సూచించారు. ఈ గోడ పత్రికలను ఆన్ని బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్ళలో ఏర్పాటు చేయాలని స్వీప్‌ నోడల్‌ అధికారి వివిఎస్‌ శర్మను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ భావన వశిస్ట్‌, సబ్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి పాల్గొన్నారు.పాడేరు: పాడేరులో శుక్రవారం ‘ఓటు హక్కుపై దివ్యాంగులతో ర్యాలీ కలెక్టర్‌ విజయ సునీత ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించు కోవాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో జాయింట్‌ కలక్టర్‌ భావన వశిష్ట్‌, పిఒ అభిషేక్‌, సబ్‌ కలక్టర్‌ దాత్రిరెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు మాధవి, ఎస్‌ డబ్ల్యుఇపి కో ఆర్డినేటర్‌ వివిఎస్‌ శర్మ, మైక్రో ఇరిగేషన్‌ అధికారి రహీం పాల్గొన్నారు.

➡️