టిడిపి నేతల ఆందోళన

ఆందోళన చేస్తున్న టిడిపి నేతలు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు: మండలంలో అతి మారుమూల ప్రాంతమైన బాబుసాలా, బుంగ పుట్టు పంచాయతీలలో గత మూడు నెలలుగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం పంపిణీ చేయలేదని శుక్రవారం తహసిల్దార్‌ కార్యాలయం వద్ద మండల టిడిపి నాయకులు శాస్త్రి బాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉచిత బియ్యం సరఫరా చేయాలని నినాదాలు చేస్తూ కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు శాస్త్రి బాబు మాట్లాడుతూ,రెండు పంచాయితీ పరిధిలో మొండిగుమ్మ, గాజులబంధ, సోపుట్టు, మత్స్య పురం, గుణ సల్మా, కొజ్జారిగూడ, గర్రం, రంగినిగూడా, కోసొం పుట్టు, కొత్తగరం, బంగురుపల్లి, సిరగంపుట్టు గ్రామ పివిటిసిలకు ఉచిత పంపిణీ కోటా బియ్యం అందలేదని, తక్షణమే మూడు మాసాల కోట బియ్యం తక్షణమే అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల లబ్ధిదారులు, టిడిపి మండల నేతలు పాల్గొన్నారు.

➡️