బెదిరేది లేదు..

అరకులో అందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి- యంత్రాంగంఅంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు వేసి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నా అదిరేది లేదని అంగన్‌వాడీలు తేల్చి చెప్పారు. అల్లూరి జిల్లాలో పలు చోట్ల అంగన్వాడీల వంటా వార్పు, భిక్షాటన, ధర్నాలు చేపట్టారు. మంగళవారం 8వ రోజు కూడా సమ్మెను ఉధృతంగా కొనసాగించారుపాడేరు: సమస్యలను పరిష్కరించాలని జిల్లా కేంద్రంలో అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెలో భాగంగా మంగళవారం బిక్షాటన నిర్వహించారు. అంగన్వాడీల సమ్మె 8వ రోజు కొనసాగింది. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీలు రోజుకో రీతిన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీల పోరు రోజురోజుకీ ఉదతం అవుతుంది. పాడేరులో అంగన్వాడీల బిక్షాటన ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. రోడ్డు పక్కన బైఠాయించిన అంగన్వాడీ వర్కరు,్ల హెల్పర్లు వాహనదారులను ఆపి భిక్షాటన చేస్తూ తమ నిరసన కొనసాగించారు. సిఐటియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎల్‌ సుందర్రావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి మొండి వైఖరిని విడనాడకపోతే తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అరకులోయ:అరకులోయ ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. అరకులోయ ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి పాలు తరలించడానికి సిద్ధంగా ఉన్న వ్యాన్‌ అంగన్వాడి కార్యకర్తలు అడ్డుకున్నారు.ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే వరకు అంగన్వాడి సెంటర్లు తెరిపించే ప్రసక్తి లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. అధికారులు బెదిరింపులకు లొంగేదీ లేదన్నారు.ఎనిమిది రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. బలవంతంగా అంగన్వాడి కేంద్రా లను తెరిచే ప్రయత్నం చేయిస్తే ఉపేక్షించబోమని వారు హెచ్చరించారు. వ్యాన్‌ ను ఐసిడిఎస్‌ ఆఫీస్‌ లోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు.అంగన్వాడీలకు యుటిఎఫ్‌ మద్దతుముంచింగిపుట్టు: మండల కేంద్రంలో అంగన్వాడీల సమ్మెకు యుటిఎఫ్‌ మండల శాఖ సంపూర్ణ మద్దతు తెలిపింది. సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి యం.ధర్మరావు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్‌ చేశారు.యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు సమరెడ్డి రాజు మాట్లాడుతూ,ముఖ్యమంత్రి మాట నిల బెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు సత్యనారాయణ, గోపి, సర్వ శిక్ష అభియాన్‌ నాయకులు అనిల్‌కుమార్‌, ఈశ్వర్రావు, సురేష్‌ పాల్గొన్నారు.అనంతగిరి:అంగన్వాడీల సమ్మెకు టిడిపి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు టి.బుజ్జిబాబు, బొర్రా పంచాయతి సర్పంచ్‌ జె.అప్పారావు మాట్లాడుతూ, అంగన్వాడి వ్యవస్థను వైసిపి రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పండుతుందన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విపలమైందని ు విమర్శించారు సమస్య పరిష్కారం అయ్యేవరకు టిడిపి అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు దయానిధి, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారుమారేడుమిల్లి :ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చూపించే వరకు తమ దీక్షలు కొనసాగుతాయని సిఐటియు జిల్లా నాయకురాలు కెవి రామలక్ష్మి అన్నారు. మండలంలోని తహశీల్దారు ముందు అంగన్వాడి, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఎనిమిదవ రోజుకి చేరింది. ఇందులో భాగంగా మంగళవారం వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. యూనియన్‌ నాయకులు నిర్మల కుమారి, ప్రసూన మారేడుమిల్లి మండలం, వై రామవరం అప్పర్‌ పార్ట్‌ అంగన్వాడీ మినీ అంగన్వాడిలు పాల్గొన్నారు.చింతూరు : చింతూరులో ఎనిమిదవ రోజు సమ్మెలో భాగంగా టెంట్‌ వద్ద వంటా వార్పు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. దీనిని సిఐటియు మండల అధ్యక్షురాలు సవలం వెంకటరమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముచ్చిక, జయమ్మ, నూకరత్నం, సత్యవతి, రాజకుమారి సుజాత, దుర్గ, చుక్కమ్మ, చిట్టమ్మ, కళ్యాణి విజయశ్రీ పాల్గొన్నారు.విఆర్‌.పురం : మండల కేంద్రం రేఖపల్లి జంక్షన్‌లో అంగన్వాడీల 8వ రోజు ఆందోళనలో భాగంగా వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. యుటిఎఫ్‌ నాయకులు సున్నం రాజులు, సోడి నాగేశ్వరరావు అంగన్వాడీల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి. యుటిఎఫ్‌ మండల నాయకుడు రామకృష్ణ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనం సత్యనారాయణ, సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు పంకు సత్తిబాబు, వడ్లది రమేష్‌, కారం సుందరయ్య, లక్ష్మణరావు, సిరపు తాతబాబు, కుంజ కన్నయ్య, సోడి మల్లయ్య, హజరత్‌, గూటాల శ్రీనివాసరావు, యూనియన్‌ నాయకులు సున్నం రంగమ్మ, రాజేశ్వరి, నాగమణి పాల్గొన్నారు.కొయ్యూరు : మండల కేంద్రంలోని అంగన్వాడీలు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు ఎంపీడీవోకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. గిరిజన సంఘం జిల్లా నాయకుడు సూరిబాబు, సిఐటియు నాయుడు వై అప్పలనాయుడు, యూనియన్‌ నాయకులు నాయకురాలు ముత్యాలమ్మ, అచ్చియమ్మ పాల్గొన్నారు.కూనవరం : మండలంలోని అంగన్వాడీల సమ్మె స్థానిక బస్టాండ్‌ సెంటర్లో 8వ రోజుకి చేరింది. ఈ సందర్బంగా వీరికి స్థానిక సీపీఎం నాయకులు మద్దతు తెలియ జేశారు.రాజవొమ్మంగి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ తచేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు మంగళవారం రాజవొమ్మంగిలో భిక్షాటన చేశారు. తొలుత రాజవొమ్మంగి ఆర్‌అండ్బి అతిథి గృహం ఎదురుగా శిబిరానికి మండలంలోని అంగన్వాడీలు వండలాదిగా చేరుకొని 8వ రోజు నిరసనలను కొనసాగించారు. అనంతరం భిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ మండల కార్యదర్శి కె వెంకటలక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు, యూనియన్‌ మండల నాయకులు చిన్ని కుమారి, రమణి, సుందరమ్మ, సత్యవతి, రాజేశ్వరి, మంగ, రాణి పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.కేంద్రం తెరవడాన్ని అడ్డుకున్న ఎంపిటిసివిఆర్‌.పురం : మండలంలోని చిన్నమట్టపల్లి గ్రామ సచివాలయం సిబ్బంది ఆ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్‌ను తెరవడానికి మంగళవారం ప్రయత్నించగా స్థానిక ఎంపీటీసీ పూనెం ప్రదీప్‌ కుమార్‌, స్థానికులు వారిని అడ్డుకొని తిరిగి పంపించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సోడి తమ్మయ్య పండా వెంకటేష్‌ నాగయ్య లక్మి తదితరులు పాల్గొన్నారు..ప్రశ్నించిన అంగన్వాడీలు.. వెనుదిరిగిన అధికారులు..కూనవరం : కూనవరం బెస్త బజార్‌ అంగన్వాడీ సెంటర్‌లో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌, పంచాయతీ అధికారులు, సిబ్బంది మంగళవారం తాళాలు బద్దలు కొట్టి సరుకులు అంచనా వేస్తుండగా, విషయం తెలుసుకున్న అంగన్వాడీలు అక్కడకు చేరుకొని వారిని నిలదీశారు. తాము లేకుండా సెంటర్‌ తాళాలు ఎలా పగలగొడతారని, ప్రభుత్వం పంపిన సర్క్యూలర్‌ చూపమని అంగన్వాడీలు అడగడంతో వారు నెమ్మదిగా అక్కడ నుండి జారుకున్నారు. మండలంలోని రేగులపాడు గ్రామంలో తాళాలు బద్దలు కొడుతున్న అధికారులను సీపీఎం కార్యకర్తలు అడ్డుకొని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, సీతారామయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

➡️