మడ్రేబు గ్రామస్తులు డోలి మోతే

ఏటిజీ.. రోగికు డోలి సహాయంతో తరలిస్తున్న

ప్రజాశక్తి అనంతగిరికేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిమా జాతి పివిటిజి గిరిజన ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో అమ్మలు కాలేదు. దీంతో, మారుమూల గిరిజన గ్రామాల్లో కనీసం రోడ్డు సౌకర్యాలు లేక రోగులు, బాలింతలు, గర్భిణీలకు డోలి కష్టాలు తప్ప లేదు. వివరాలు.. అనంతగిరి మండలం మారుమూల పెద్దకోట పంచాయతీ పరిధి ఆదిమ జాతి పివిటిసి మడ్రేబు గ్రామానికి చెందిన కొండతాబేలి లింబో అనే గిరిజనుడు గత వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు గ్రామం నుండి దట్టమైన అటవీ ప్రాంతం కొండ కోనల నడుమ సుమారు 10 కిలోమీటర్ల దూరం దుప్పటి డోలి కట్టి తునిసిబు గ్రామం రోడ్డులో చేర్చారు. అక్కడి నుండి ప్రధమ చికిత్స నిమిత్తం పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు రోగికి చికిత్స అందించడంతో ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. అనంతరం ఆసుపత్రి నుండి తునిసిబు గ్రామం వరకు ప్రైవేటు వాహనంలో తరలించి అక్కడ నుండి కుటుంబ సభ్యులు మడ్రేబు గ్రామం వరకు డోలి సాయంతో తిరిగి తరలించారు. గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం కల్పించాలని ఈనెల 14వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగే జిల్లా పరిషత్‌ సమావేశంలో ఆందోళన చేపడతామని పివిటిజీ సంఘం జిల్లా అధ్యక్షులు, సిపిఎం కార్యవర్గ సభ్యులు కె.గోవింద్‌ తెలిపారు.

➡️