రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

శంకుస్థాపన చేస్తున్న ఎంపిపి, సర్పంచ్‌

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:మండలంలోని మాడగడ పంచాయతీ నందివలస జంక్షన్‌ నుండి బస్కి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బస్కి పంచాయితి సర్పంచ్‌ పాడి రమేష్‌ ఆధ్వర్యంలో శనివారం ఎంపీపీ రంజపల్లి ఉషారాణి శంకుస్థాపన చేశారు. సర్పంచ్‌ రమేష్‌ మాట్లాడుతూ, రోడ్డు మరమ్మతుతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఫాల్గుణకు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులు త్వరగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి కిల్లో రామన్న, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎల్బి కిరణ్‌ కుమార్‌, మాడగడ సర్పంచ్‌ జ్యోతి, కొత్తబల్లుగుడ సర్పంచ్‌ కొర్ర రాధిక, వైసీపీ నాయకులు బాలరాజు, నాగేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️