వైసిపితోనే మహిళలకు ఆర్థిక భరోసా

ఆసరా చెక్కుల పంపిణీ చేస్తున్న ఎంపిపి, జెడ్‌పిటిసి

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వైసిపి ప్రభుత్వం పలు పథకాల ద్వారా భరోసా కల్పిస్తుందని ఎంపీపీ, జెడ్‌పిటిసి బి.ఈశ్వరి, సిహెచ్‌ జానకమ్మ చెప్పారు. మండల కేంద్రంలోని అల్లూరి గ్రౌండ్‌ వద్ద ఐకెపి అరుకు ఏరియా కోఆర్డినేటర్‌ ఎస్‌.కృష్ణారావు ఆధ్వర్యంలో గురువారం ఆసరా పథకం నాలుగవ విడత సంబరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 496 మహిళా సంఘాల్లోని 4607మంది లబ్ధిదారులకు రూ కోటి 28 లక్షల 81వేల 441లు చెక్కును మహిళలకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి పథకంలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ వారి ఖాతాలోనే సంక్షేమ పథకాల నగదును ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెందేందుకు వైసిపి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఇంటింటికి వైద్యం అందించిన ఘనత జగన్మోహన్‌ రెడ్డిదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎం.గీతా, ఐకెపిపిడి మురళి, ఏపీఓ సూరిబాబు, డిపిఎం నీలకంఠం, దాసు పాల్గొన్నారు.

➡️